మన పత్రిక, రాజకీయం: అమరావతి పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ప్రకటించారు. మార్చి 28న కూటమి ప్రభుత్వం అమరావతి చట్టబద్ధత బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కూడా సభలో హామీ ఇచ్చారని తెలిపారు.
ఏపీకి జరిగిన అన్యాయంపై మౌనంగా ఉండలేమని స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అమరావతికి తమ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఈ బిల్లుపై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, జనసేన ఎంపీ బాలశౌరి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా మాట్లాడనున్నారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
