మన పత్రిక, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం రణబలిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, T-సీరిస్ సమర్పిస్తోంది. ఇటీవలే విజయ్, రష్మిక పెళ్లి వార్తలతో ట్రెండ్ అవుతుండగా, ఈ సినిమాలో వీరు పోషిస్తున్న రణబలి, జయమ్మ పాత్రలపై ఆసక్తి మరింత పెరిగింది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా షూటింగ్ వీడియో లీక్ కావడం చర్చనీయాంశమైంది. ఆ వీడియోలో గుర్రంపై దూసుకొస్తూ విజయ్ చెప్పిన మాస్ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈసారి విజయ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు’, ‘డైలాగ్ డెలివరీ సూపర్’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
