మన పత్రిక, క్రైం: హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఐనవోలు మండలం ఫున్నేలులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ అజహరుద్దీన్ తన భార్య ఫర్హత్(26), కూతుళ్లు ఉమేరా(8), ఆయేషా(7)తో కలిసి బుధవారం రాత్రి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. కొంతసేపు బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ముగ్గురు నీటిలో మృతిచెందిన స్థితిలో కనిపించారు. పిల్లలకు ఈత రాక మునిగిపోతుండగా వారిని రక్షించే ప్రయత్నంలో తల్లి కూడా మునిగిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా మృతురాలి తల్లి సంచలన ఆరోపణలు చేసింది. తన కుమార్తె మూడు నెలల గర్భిణి అని, గతంలో రెండు సార్లు గర్భస్రావాలు చేయించారని ఆరోపించింది. ఆడపిల్లలు పుడుతున్నాయనే కారణంతో భర్త వేధింపులకు గురిచేశాడని, అత్తింటివారే తన కూతురిని హత్య చేశారని పేర్కొంది. ఇక ఈ ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. పెద్ద కుమార్తె ఉమేరా పుట్టినరోజు సందర్భంగా కుటుంబం ఆనందంగా వేడుకలు జరుపుకుంది. కేక్ కట్ చేసి, భోజనం చేసిన అనంతరం స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. ఆనందంగా సాగిన ఆ వేడుక క్షణాల్లోనే విషాదంగా మారింది. తండ్రి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదు
- రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
- వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి నారా లోకేశ్
