నేడే శ్రీరామనవమి..శుభ ముహూర్తం ఎప్పుడంటే
మన పత్రిక: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ ఏడాది పూజాదికాలకు సంబంధించి పండితులు ముఖ్యమైన సమయాలను సూచించారు. ముహూర్త విశేషాలు భక్తులకు సూచనలు ఇంట్లో పూజ చేసుకునే భక్తులు మధ్యాహ్నం ఒంటి గంటలోపు స్వామివారికి నైవేద్యం (వడపప్పు, పానకం) సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాతే ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. రామాలయాలన్నీ భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి.