మన పత్రిక, వాతావరణం: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అయితే వేడిగాలుల మధ్య ఉపశమనం కలిగించేలా వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. గురువారం మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
Advertisement
