పొగాకు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు పట్టు
పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమస్యకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమస్యకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్-నినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడినందున ఇరిగేషన్ అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట-బి.సానత్తం గనుల్లో వేలం ప్రక్రియ ద్వారా తవ్వకాలు పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు విడుదల చేసింది.
గుంతకల్లు – బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
అదనపు కట్నం వేధింపులు, గృహ హింస ఆరోపణలతో మాజీ మంత్రి జోగి రమేశ్ సహా 11 మంది కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. బాధితులకు వైద్యుల సంరక్షణలో చికిత్స అందిస్తున్నారు.
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారిక ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఘటనపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.