మన పత్రిక, అమరావతి: రాజధాని అమరావతిలో PNB Quantum Hub పేరిట క్వాంటం ఫైనాన్స్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై ఇరు వర్గాల ప్రతినిధులు సంతకాలు చేశారు. దేశంలోనే ఇలాంటి ప్రత్యేక హబ్‌ను ఏర్పాటు చేస్తున్న మొదటి బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది.
బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక మోసాలను నివారించడమే లక్ష్యంగా ఈ క్వాంటం ఫైనాన్స్ హబ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యతను మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకు ప్రతినిధులకు సూచించారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు: 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
- మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధించిన పలాస కోర్టు
- అమరావతిని క్వాంటం హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కీలక చర్చలు
- హనీమూన్ హత్య కేసులో భార్య బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
- తెనాలిలో డ్రైవింగ్ టెస్టు సందర్భంగా కారు ప్రమాదం: నలుగురికి గాయాలు
