కోహెడలో రూ.2,300 కోట్లతో పండ్ల మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన

మన పత్రిక, కోహెడ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో రూ.2,300 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 240 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మార్కెట్‌ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అన్ని రకాల పండ్లు ఒకే చోట అందుబాటులో ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. పండ్ల మార్కెట్‌తో పాటు అదే ప్రాంగణంలో … Read more

Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, పలు విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం మే 31తో ముగియాల్సిన సెలవులు తాజా నిర్ణయంతో పొడిగించబడ్డాయి. జూన్ 7 ఆదివారం కావడంతో తిరిగి జూన్ 8న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఓయూ బాటలోనే … Read more

TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్‌లైన్ పరీక్షలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) జూన్ 2026 ఎడిషన్‌కు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. జూన్ 16 నుంచి 22 వరకు మొత్తం ఐదు రోజుల పాటు 10 సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో (CBT) ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. షిఫ్ట్-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, షిఫ్ట్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 … Read more

TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్​ ట్రస్ట్..

TG Employees Health Scheme

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ (EHS)ను పారదర్శకంగా అమలు చేసేందుకు ‘ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్’ ఏర్పాటు చేయనున్నారు. ఈ నూతన ఆరోగ్య భద్రత పథకం అమలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో నేడు (మే 31) సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పథకం కింద ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు), … Read more

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజా రెడ్డి

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజా రెడ్డిని ప్రభుత్వం నియమించింది. గ్రూప్-1 ద్వారా గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికైన శ్రీజా రెడ్డి ఇటీవల తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమెను మిర్యాలగూడకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఇప్పటివరకు మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్‌ను ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేసింది. RohithRohith is a Chief Editor … Read more

Telangana Welfare Schemes: తెలంగాణలో ఒకే కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. లబ్ధిదారుల డేటాను నిరంతరం ట్రాక్ చేసేలా, అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పనిచేసే ‘మల్టీ-పర్పస్ యూనిఫైడ్ కార్డ్’ను తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), ఫీజు రీఇంబర్స్‌మెంట్, కార్మిక, విద్యా శాఖల … Read more

బీఎస్ఎన్ఎల్‌లో 100 జేటీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మన పత్రిక, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ (జేటీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్ 4వ తేదీ నుంచి జూలై 3, 2026 వరకు బీఎస్ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ bsnl.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు … Read more

నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు

TG DOST Registrations 2026

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘దోస్త్’ (TG DOST) రెండో విడత రిజిస్ట్రేషన్ల గడువు నేటితో (మే 25) ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. మొదటి విడతలో సీటు రాని విద్యార్థులు, అలాట్ అయిన కాలేజీ నచ్చని వారు, అసలు దరఖాస్తు చేసుకోని కొత్త అభ్యర్థులు … Read more

తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు

Telangana Glass Bridge

మన పత్రిక, సిద్దిపేట: తెలంగాణ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో రూపుదిద్దుకుంటోంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఈ వంతెనను హృదయాకారంలో (లవ్ సింబల్) డిజైన్ చేయడం దీని ప్రత్యేకత. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో రూ.4.22 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 150 మీటర్ల పొడవు, 5 … Read more

బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..

Bandlaguda Missing Girl Case

మన పత్రిక, హైదరాబాద్: అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని బండ్లగూడ పోలీసులు వేగంగా స్పందించి కేవలం రెండు గంటల్లోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘౌస్‌నగర్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి బుధవారం మధ్యాహ్నం కనిపించకుండా పోయింది. దీనితో ఆందోళనకు గురైన పాప తల్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. పరిసర … Read more