తెలంగాణలో 3 లక్షల మందికి కొత్త చేయూత పెన్షన్లు | Telangana Cheyutha Pension

తెలంగాణలో 3 లక్షల మందికి కొత్త చేయూత పెన్షన్లు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 3 లక్షల మంది అర్హులకు చేయూత పెన్షన్లు అందించేందుకు కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ప్రస్తుతం పాత లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ లైవ్ ఆథెంటికేషన్ (Live Authentication) నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే కొత్త లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం చేపట్టనుంది. 3 లక్షల మందికి పెన్షన్లు ఎలా ఇస్తారు? గత బడ్జెట్‌లో … Read more

బేబీ షవర్‌కు ముందు వివాదం: భర్త, అత్తను అరెస్ట్ చేసిన మెదక్ పోలీసులు

మన పత్రిక, మెదక్: మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలంలో జరిగిన ఓ కుటుంబ ఘటన తీవ్ర కలకలం రేపింది. బేబీ షవర్ (శ్రీమంతం) ఏర్పాట్ల సమయంలో ఇరు కుటుంబాల మధ్య మొదలైన విభేదాలు చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, అత్తపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక యువతికి సుమారు ఏడాదిన్నర క్రితం అల్లాదుర్గం మండలంలోని … Read more

Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ ఇండియా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తన సరికొత్త ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ను గ్రాండ్‌గా ప్రారంభించింది. మాదాపూర్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం, భారతదేశంలో టెస్లాకు చెందిన ఐదో ఎక్స్‌పీరియన్స్ సెంటర్. జూన్ 17, 2026 నుంచి ఈ సెంటర్ అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లకు మెరుగైన సర్వీస్ సపోర్ట్ అందించేందుకు బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో డెలివరీ, ఆఫ్టర్-సేల్స్ … Read more

Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు

మన పత్రిక: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘టీజీ టీ20’ టోర్నమెంట్‌కు బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారని ఆరోపించింది. ఈ టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ సహా అంబటి రాయుడు, సిరాజ్, తిలక్ వర్మ తదితరులు ఒప్పందాలు చేసుకునే ముందే టోర్నీ చట్టబద్ధతను పరిశీలించుకోవాలని టీసీఏ జనరల్ సెక్రటరీ సూచించారు. సుప్రీంకోర్టు నిబంధనల … Read more

Suryapet : జడ్పి సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్: కలెక్టర్ ఉత్తర్వులు

మన పత్రిక, సూర్యాపేట: పంచాయతీ కార్యదర్శుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన జడ్పి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్.కె. మెయినోద్దీన్‌ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో ఆధారాలతో సహా రుజువు కావడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మెయినోద్దీన్ గతంలో గరిడేపల్లి మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తన పరిధిలోని పలువురు పంచాయతీ … Read more

ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కె.ఎల్.ఎన్ విద్యార్థుల విజయకేతనం

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడకు చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాల్లో ఎంపీసీ విభాగానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించి ఏకంగా రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు పొందారు. ఎంపీసీ విభాగంలో శ్రావణి 468 మార్కులు, అంజన 468 మార్కులు, చంద్రలేఖ 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు పొందారు. అదేవిధంగా హన్సిక 467, అక్షిత 467, వాణి 467 … Read more

నల్లబండగూడెంలో ఉపాధి హామీ పనుల్లో కుప్పకూలి కూలీ మృతి

మన పత్రిక, కోదాడ: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లిన వేముల పుల్లమ్మ (56) అనే మహిళా కూలీ శుక్రవారం పని స్థలంలోనే ఆకస్మికంగా మృతి చెందింది. రోజువారీ మాదిరిగానే ఉదయం కరువు పనికి వెళ్లిన ఆమె, తోటి వారితో కలిసి పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఉపాధి హామీ కూలీ మృతి చెందిన విషయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న … Read more

TG Inter Supplementary Results 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

మన పత్రిక: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026 సంవత్సరానికి గానూ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు జూన్ 11న అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో నేరుగా మార్కులను తనిఖీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘TS Inter … Read more

Suryapet : ట్రాక్టర్‌ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..

మన పత్రిక, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం ఈటూరు గ్రామంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన బొబ్బిలి లింగస్వామి (33) గ్రామం నుంచి ఎస్సారెస్పీ కాల్వ వద్దకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి కిందపడటంతో లింగస్వామి తలకు బలమైన గాయమైంది. … Read more

School Summer Holidays : స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు..

మన పత్రిక: Telangana రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభ తేదీని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ తేదీని 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 13వ తేదీన రెండో శనివారం, అలాగే 14వ తేదీన ఆదివారం వరుసగా సెలవు దినాలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సెలవుల సర్దుబాటులో … Read more