Advertisement

TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్​ ట్రస్ట్..

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ (EHS)ను పారదర్శకంగా అమలు చేసేందుకు ‘ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్’ ఏర్పాటు చేయనున్నారు. ఈ నూతన ఆరోగ్య భద్రత పథకం అమలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో నేడు (మే 31) సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ పథకం కింద ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు), వారి కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారుల వివరాలను నిర్దేశిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి ఈ రోజే (మే 31) చివరి తేదీ. డేటా సేకరణ గడువు నేటితో ముగుస్తుండటంతో, అర్హులైన వారందరూ వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది.

Advertisement

ట్రస్ట్ నిర్మాణం ఇలా.. ఉద్యోగులు, పెన్షనర్ల భాగస్వామ్యంతో పని చేసే ఈ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులకు సభ్యత్వం కల్పిస్తారు. దీని పరిపాలనను పర్యవేక్షించడానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని సీఈవోగా నియమించనున్నారు. లబ్ధిదారుల డేటాబేస్ ఆధారంగా జారీ చేసే డిజిటల్ కార్డుల ద్వారా రాష్ట్రంలోని గుర్తింపు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా (క్యాష్‌లెస్) వైద్య సేవలు అందనున్నాయి.

Advertisement