మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, పలు విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం మే 31తో ముగియాల్సిన సెలవులు తాజా నిర్ణయంతో పొడిగించబడ్డాయి. జూన్ 7 ఆదివారం కావడంతో తిరిగి జూన్ 8న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి.
ఓయూ బాటలోనే రాష్ట్రంలోని మరికొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా సెలవులను పొడిగించాయి. పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలకు కూడా జూన్ 6 వరకు సెలవులు పొడిగించారు. ఇవి కూడా జూన్ 8న తెరుచుకోనున్నాయి. మరోవైపు కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలకు జూన్ 5 వరకు సెలవులు పొడిగించగా.. ఇవి జూన్ 6న తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఖమ్మంలో 45.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అనుబంధ కళాశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
- Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్గా నర్రా శ్రీజా రెడ్డి
