Advertisement

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజా రెడ్డి

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజా రెడ్డిని ప్రభుత్వం నియమించింది. గ్రూప్-1 ద్వారా గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికైన శ్రీజా రెడ్డి ఇటీవల తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమెను మిర్యాలగూడకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాగా, ఇప్పటివరకు మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్‌ను ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేసింది.

Advertisement
Advertisement