మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) జూన్ 2026 ఎడిషన్‌కు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. జూన్ 16 నుంచి 22 వరకు మొత్తం ఐదు రోజుల పాటు 10 సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో (CBT) ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. షిఫ్ట్-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, షిఫ్ట్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు ఉంటుంది.
పరీక్షల షెడ్యూల్ వివరాలు:
- జూన్ 16: రెండు షిఫ్టుల్లో టెట్ పేపర్-I
- జూన్ 17: ఉదయం పేపర్-I, మధ్యాహ్నం పేపర్-II (గణితం, సైన్స్)
- జూన్ 18: రెండు షిఫ్టుల్లో పేపర్-II (గణితం, సైన్స్)
- జూన్ 19: రెండు షిఫ్టుల్లో పేపర్-II (సాంఘిక శాస్త్రం)
- జూన్ 22: ఉదయం పేపర్-II (గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం), మధ్యాహ్నం హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, సంస్కృత మాధ్యమాలలో పేపర్-I
పూర్తి వివరణాత్మక పరీక్షా షెడ్యూల్ అధికారిక వెబ్‌సైట్ [https://schooledu.telangana.gov.in](https://schooledu.telangana.gov.in) లో అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
1.36 లక్షల దరఖాస్తులు.. ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం 1,36,418 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-I కి 32,779 మంది, పేపర్-II కి 86,305 మంది, రెండు పేపర్లకు కలిపి 17,334 మంది దరఖాస్తు చేశారు. మొత్తం దరఖాస్తుదారులలో 28,149 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడం గమనార్హం. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో, ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత సాధించడానికి 2028 ఆగస్టు 31 వరకు కోర్టు సమయం ఇచ్చిన విషయం తెలిసిందే.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
