ఆశా వర్కర్లపై పోలీసుల ప్రతాపం.. సూర్యాపేటలో ఉద్రిక్తం | Telangana Assembly

మన పత్రిక, వెబ్​డెస్క్: అసెంబ్లీ సమావేశాల వేళ సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఏకంగా ఆశా వర్కర్ల ఇళ్లకు వెళ్లి, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యంపై … Read more

TG Assembly: మాజీ సర్పంచుల ముట్టడి.. రూ.531 కోట్ల కోసం రచ్చ!

మన పత్రిక, వెబ్​డెస్క్: పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ మాజీ సర్పంచులు చేపట్టిన ఆందోళనతో తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మారినా విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.531 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వారు తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో … Read more

రోడ్లపై కేక్ కటింగ్ చేస్తే కేసులే.. ఎస్పీ సీరియస్ వార్నింగ్!

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర వేడుకల వేళ సూర్యాపేట జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచే విస్తృత తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఇవే:

Telangana Assembly: ఇరిగేషన్‌పై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. పాలమూరుపై ఆరా

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి సాగునీటి రంగం, ప్రాజెక్టుల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్న అంశాలపై సీఎం ఫోకస్ పెట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నదీజలాల వాటా, ఏపీతో కొనసాగుతున్న జల … Read more

హైదరాబాద్ క్రైమ్త గ్గిన నేరాలు.. మహిళలపై పెరిగిన కేసులు

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ నగరంలో 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక నేర నివేదికను పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ విడుదల చేశారు. నగరంలో ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 15 శాతం తగ్గినప్పటికీ, మహిళలు, చిన్నారులపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2024తో పోలిస్తే మొత్తం కేసులు 35,944 నుంచి 30,690కి తగ్గాయని సిపి వెల్లడించారు. అయితే, మహిళలపై నేరాలు 6 శాతం పెరిగాయని, ముఖ్యంగా గృహ హింస కేసులు 31 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం … Read more

TET HALL TICKETS డౌన్‌లోడ్ చేసుకోండిలా.. పరీక్ష తేదీలివే

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026)కు హాజరయ్యే అభ్యర్థులకు అలర్ట్. టెట్ హాల్ టికెట్లు ఈరోజు విడుదల కానున్నాయి. అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను రోజుకు రెండు సెషన్లలో (ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి … Read more

జీహెచ్‌ఎంసీ కొత్త మ్యాప్ విడుదల.. 300 డివిజన్లు, 60 సర్కిళ్లుగా పెంపు

GHMC New Map: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. డివిజన్ల పునర్విభజనను అధికారికంగా ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో, తాజాగా కొత్త జీహెచ్‌ఎంసీ మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ కొత్త వ్యవస్థలో గ్రేటర్ పరిధిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా మ్యాప్ ప్రకారం నగరంలో మొత్తం డివిజన్ల సంఖ్య 300కు చేరింది. పరిపాలనా సౌలభ్యం కోసం జోన్ల సంఖ్యను 6 నుంచి 12కు, … Read more

అసెంబ్లీకి కేసీఆర్: ఎర్రవెల్లి భేటీలో కీలక నిర్ణయం.. డిసెంబర్ 29న హాజరు!

ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణపై చర్చించిన ఆయన.. ఈనెల 29న శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేస్తోందని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. … Read more

టీజీ టెట్ టెస్ట్ లింక్ విడుదల | TG TET 2026 Mock Test

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026)కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా అధికారిక మాక్ టెస్ట్ లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలో పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మాక్ టెస్ట్ కోసం అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లింక్‌లో డిఫాల్ట్‌గా ఉండే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో … Read more

School Holidays: స్కూళ్లకు 9 రోజులు సెలవులు.. సంక్రాంతి హాలిడేస్ లిస్ట్ ఇదే

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు వరుసగా 9 రోజుల పాటు సెలవులను ఖరారు చేసింది. జనవరి 10 (రెండో శనివారం) నుంచి సెలవులు మొదలై జనవరి 18 (ఆదివారం) వరకు కొనసాగుతాయని, తిరిగి జనవరి 19న బడులు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు. గత ఏడాది కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా, ఈసారి శని, ఆదివారాలు కలిసి రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. పొరుగున … Read more