మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి సాగునీటి రంగం, ప్రాజెక్టుల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రధానంగా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్న అంశాలపై సీఎం ఫోకస్ పెట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నదీజలాల వాటా, ఏపీతో కొనసాగుతున్న జల వివాదాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై అధికారుల నుంచి ఆరా తీశారు. ముఖ్యంగా ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకంపై సీఎం కూలంకషంగా సమీక్షించారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన పనులు, గత రెండేళ్లలో చోటుచేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను వెలికితీయాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
