Vemuri Kaveri Travels : వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు

fire accident to vemuri kaveri travels bus in rangareddy

Vemuri Kaveri Travels : కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘటన మరవకముందే అదే ట్రావెల్స్ కు చెందిన మరో బస్సులో పొగలు వచ్చాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ ఫ్లైఓవర్ పై చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత బస్సులో పొగలు రావడం ప్రారంభమయ్యాయి. బస్సు ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు అది. రాత్రి పూట బస్సులో పొగలు రావడంతో … Read more

ACB: షాక్.. రూ. 50 వేల లంచం!

ACB medak tekmal si rajesh

మన పత్రిక, వెబ్​డెస్క్: మెదక్ జిల్లా (Medak District) టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై రాజేష్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై, వారి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి సమీపంలోని పంట పొలాల్లోకి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు, సినిమా ఫక్కీలో ఛేజింగ్ చేసి మరీ ఎస్సైని … Read more

Chain Snatching : పట్టపగలే హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్

chain snatching in tunkunta Hyderabad

Chain Snatching : హైదరాబాద్ నగరంలో పట్టపగలే చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంట రోడ్డుపై ఈ ఘటన జరిగింది. తూంకుంట రోడ్డుపై ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు దగ్గరగా బైక్ పోనిచ్చి ఆమె మెడలోని గొలుసును లాక్కొని పరారయ్యారు. వెంటనే తేరుకున్న ఆ మహిళ వాళ్ల వెంట పరిగెత్తినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటన పక్కనే ఉన్న మెడికల్ … Read more

Disqualified MLAs : ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ రిలీజ్

Telangana speaker releases inquiry schedule for disqualified mlas

Disqualified MLAs : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ ను తెలంగాణ స్పీకర్ విడుదల చేశారు. ఈనెల 19, 20 వ తేదీల్లో మిగిలిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. ఈనెల 19వ తేదీన తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, 20 వ తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించనున్నారు. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, … Read more

Pista House – Shah Ghouse : పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్లపై ఐటీ రైడ్స్

it raids at pista house and shah ghouse

Pista House – Shah Ghouse : హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ హోటళ్లు అయిన పిస్తా హౌస్, షా గౌస్ హోటళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి నగరంలో ఉన్న అన్ని బ్రాంచులకు సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లపై ఒకేసారి ఐటీ రైడ్స్ ను అధికారులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి హోటళ్లు, హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. Mana Patrika DeskMana Patrika Web Desk is … Read more

Husband Suicide : చికిత్స పొందుతూ 8 నెలల గర్బిణీ మృతి.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య

husband commits suicide after pregnant wife dies in shamsabad

Husband Suicide : 8 నెలలు నిండిన ఓ గర్బిణీ నొప్పి తట్టుకోలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో అది తట్టుకోలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అందులోనూ తన భార్య కడుపులో ఉన్నది కవల పిల్లలు. కవలలు జన్మిస్తారని ఎంతో ఆశపడ్డ ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన శంషాబాద్ లో చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేస్తున్న విజయ్.. ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లో నివాసం … Read more

Prajavani | హైదరాబాద్‌లో నేటి నుంచి ప్రజావాణి

Prajavani

మన పత్రిక, వెబ్​డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 6న షెడ్యూల్ విడుదల కాగా, అక్టోబర్ 13న అధికారిక నోటిఫికేషన్ జారీతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అదే రోజున జరగాల్సిన ప్రజావాణితో పాటు అన్ని ప్రజా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రంతో కోడ్ ముగియడంతో నేటి నుంచి ప్రజావాణి తిరిగి పునఃప్రారంభమవుతోంది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి సాధారణంగా ప్రజల నుంచి విస్తృత స్పందన లభిస్తోంది. గత … Read more

School | కూర లేక కారంతో భోజనం

mahbubabad eklavya school food issue

మన పత్రిక, వెబ్​డెస్క్: మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District) కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి కలవరపరుస్తోంది. కూరగాయల సరఫరా టెండర్ ముగిసి 15 రోజులు గడిచినా కొత్త టెండర్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కూర లేకుండా కారంతోనే భోజనం పెడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అడవి ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాల విద్యార్థులు బయటకు రాలేక తమ సమస్యలు చెప్పుకోలేకపోయారు. నిన్న జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో విషయం బయటపడగా, ఈ రోజు … Read more

Bus Accident : మరో బస్సు యాక్సిడెంట్.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

bus accident in jangaon dist telangana

Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో చాలామంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కూడా చాలా బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద మరో బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ – వరంగల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ … Read more

Telangana High Court : తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్

Telangana high court website hack

Telangana High Court : తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ కు గురయింది. వెబ్ సైట్ లో ఉండే ఆర్డర్ కాపీలు, పీడీఎఫ్ ఫైల్స్ కు బదులుగా ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్ సైట్ ఓపెన్ అయింది. బీడీజీ స్లాట్ అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోంది. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేస్తోంది. Mana Patrika DeskMana Patrika Web … Read more