మన పత్రిక, వెబ్డెస్క్: అసెంబ్లీ సమావేశాల వేళ సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఏకంగా ఆశా వర్కర్ల ఇళ్లకు వెళ్లి, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
