GHMC New Map: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. డివిజన్ల పునర్విభజనను అధికారికంగా ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో, తాజాగా కొత్త జీహెచ్ఎంసీ మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు.
ఈ కొత్త వ్యవస్థలో గ్రేటర్ పరిధిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా మ్యాప్ ప్రకారం నగరంలో మొత్తం డివిజన్ల సంఖ్య 300కు చేరింది. పరిపాలనా సౌలభ్యం కోసం జోన్ల సంఖ్యను 6 నుంచి 12కు, సర్కిళ్లను 30 నుంచి 60కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
