మన పత్రిక, వెబ్డెస్క్: హైదరాబాద్ నగరంలో 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక నేర నివేదికను పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ విడుదల చేశారు. నగరంలో ఓవరాల్గా క్రైమ్ రేట్ 15 శాతం తగ్గినప్పటికీ, మహిళలు, చిన్నారులపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2024తో పోలిస్తే మొత్తం కేసులు 35,944 నుంచి 30,690కి తగ్గాయని సిపి వెల్లడించారు.
అయితే, మహిళలపై నేరాలు 6 శాతం పెరిగాయని, ముఖ్యంగా గృహ హింస కేసులు 31 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. అత్యంత ఆందోళనకరంగా పోక్సో (POCSO) కేసులు 27 శాతం పెరిగి 568కి చేరాయి. ఇదే సమయంలో అత్యాచార కేసులు 31 శాతం తగ్గాయి. మహిళల్లో పెరిగిన అవగాహన, ధైర్యంగా ఫిర్యాదులు చేయడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని కమిషనర్ పేర్కొన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
