తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026)కు హాజరయ్యే అభ్యర్థులకు అలర్ట్. టెట్ హాల్ టికెట్లు ఈరోజు విడుదల కానున్నాయి. అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ నుంచి నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షలను రోజుకు రెండు సెషన్లలో (ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు) నిర్వహించనున్నారు. ఈసారి టెట్‌కు రికార్డు స్థాయిలో 2,37,754 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పేపర్-2కు అత్యధికంగా 1,52,216 మంది పోటీపడుతుండగా, 1.66 లక్షల మంది ఇన్-సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
