బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అరెస్ట్

హైదరాబాద్‌: రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రముఖ మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అక్రమ అరెస్టులతో … Read more

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టు

TELANGANA POLITICS: సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కోకాపేటలోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్‌ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి, వీరిద్దరిని నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులకు, … Read more

మహబూబాబాద్‌: భర్త ఫోన్ ఎత్తలేదని భార్య సూసైడ్

మహబూబాబాద్‌ క్రైం: భర్త ఫోన్‌ లిఫ్ట్ చేయలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల(20)కు, మహబూబాబాద్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ మేనేజర్ బాణోత్ హుస్సేన్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన అఖిల.. పాప ఏడుస్తుండటంతో భర్తతో మాట్లాడించేందుకు ఈ … Read more

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

TELANGANA POLITICS: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోత మోగించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో నర్సారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బారికేడ్లను తోసుకుంటూ ఫామ్‌హౌస్‌కు అర కిలోమీటరు దూరానికి చేరుకుని నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లడంతో పోలీసులకు, ఆందోళనకారులకు తోపులాట జరిగి, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు మర్కుక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు రైతు దీక్ష చేపట్టాయి. … Read more

రామ్ చరణ్, సుకుమార్ కాంబో చిత్రంపై కీలక తాజా సమాచారం

దర్శకుడు సుకుమార్ ఆర్‌సి17 చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. రామ్ చరణ్‌కు త్వరలోనే కథను వినిపించనున్నారు.

బిగ్‌బాస్ 10 మొదట్లోనే రగడ: కేప్టెన్సీ పోరులో సవాళ్లు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రారంభమైన మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ప్రత్యేక అధికారాల కేటాయింపులతో హౌస్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బిగ్ బాస్ తెలుగు 10: పోటీదారుల పారితోషికం వివరాలు

బిగ్ బాస్ తెలుగు 10 పోటీదారుల వారంవారీ పారితోషికం, సామాన్యుల రుసుము, చెల్లింపుల నిబంధనలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వివరాలు ఇవే.

యశ్ ‘టాక్సిక్’ ఓటీటీ హక్కులకు రూ.30 కోట్ల ఆఫర్?

కన్నడ నటుడు యశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘టాక్సిక్’ చిత్ర ఓటీటీ హక్కులకు భారీగా ధర తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఓటీటీ సంస్థలు తమ ఆఫర్లను తగ్గించినట్లు సమాచారం.

AP మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో 913 ఆశావర్కర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తాజాగా మరో 913 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ‘డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు … Read more

నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా: MLC తాతా మధు

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్న సమయంలో ఆయన స్పీకర్‌ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ వివాదం ముప్పేట దాడిలా మారుతుండటంతో తాతా మధు స్పందించాల్సి వచ్చింది. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను స్పీకర్‌ను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు అనలేదని, … Read more