Advertisement

రంపచోడవరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన చంద్రబాబు, లోకేశ్

మన పత్రిక, రంపచోడవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Chandrababu Naidu, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రంపచోడవరంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఇక్కడ నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ భోజనం నాణ్యత ఎలా ఉందో స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థులకు ఉదయం వేళ రాగి మాల్ట్, మధ్యాహ్నం చిక్కీ అందిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. భోజనం ముగిసిన తర్వాత విద్యార్థుల కోరిక మేరకు వారితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫోటోలు దిగారు.

Advertisement
Advertisement