Advertisement

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

మన పత్రిక: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. ఎలాంటి టోకెన్లు లేని సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోవడంతో క్యూలైన్లు బయటకు వచ్చి శిలాతోరణం వరకు పొడవునా విస్తరించాయి.

తిరుమలలో శనివారం నాడు ఒక్క రోజే 84 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శనివారం ఒక్కరోజే రూ. 3.78 కోట్ల హుండీ ఆదాయం నమోదైనట్లు తిరుమల అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న వారికి అవసరమైన సౌకర్యాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement