డీఎస్సీ-2025లో భారీగా అక్రమాలు: జగన్

డీఎస్సీ-2025 నియామకాల్లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని వైకాపా అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.స్పోర్ట్స్‌ కోటా పేరుతో పరీక్ష రాయకుండానే కొందరికి టీచర్‌ పోస్టులు ఇచ్చేశారని, జరగని గేమ్స్‌లో ఆడినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వీళ్లే ధ్రువీకరించుకున్నారని మండిపడ్డారు. అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాల్లోనూ తీవ్ర అవకతవకలు జరిగాయని, వీటిపై ఆధారాలు చూపిస్తున్న అభ్యర్థులు, జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వ్యవస్థలను చెడగొడితే … Read more

TG: ఒకేరోజు దంపతుల బలవన్మరణం

CRIME: తార్నాక: ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఓ దంపతుల సంసారంలో మనస్పర్థలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. గురువారం లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన శరణప్ప (28), లక్ష్మి (24) దంపతులకు 15 నెలల క్రితం వివాహమైంది. తార్నాక విజయపురి కాలనీలో శరణప్ప తల్లిదండ్రులతో కలసి నివసిస్తున్నారు. శరణప్ప నాచారంలోని … Read more

ఏపీలో వర్షాలు.. 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు గంటల్లో తొమ్మిది జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. … Read more

సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ

TG: ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, సంఘాల నాయకులపై ఉన్న ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల కలుగుతున్న నష్టం, పీఆర్సీ కమిటీ నివేదిక ఆలస్యంపై నెలకొన్న ఆవేదనను వివరించారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం.. తాను ఎల్లప్పుడూ ఉద్యోగుల … Read more

మహిళా పోలీసుల సమర్థత అభినందనీయం: స్పీకర్ గడ్డం

TG: అసెంబ్లీ బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 7న అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆయన ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సమయంలో తలెత్తిన పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళా ఉద్యోగులు తమ విధులను అత్యంత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించారని స్పీకర్ … Read more

చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే నీళ్ల తరలింపు: మాజీ మంత్రి హరీశ్‌రావు

TG: దేశమంతా ఎల్‌నినో ప్రభావం ఉన్న ఈ తరుణంలో చుక్కచుక్క నీటిని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాలపై మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పంట పొలాలు ఎండుతుంటే, కృష్ణా జలాలను దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా ఏపీకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లముందే నీళ్లు పారుతున్నా ప్రజలకు ఇవ్వలేని దుస్థితి సాగుతోందని ధ్వజమెత్తారు. పాలమూరుపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న ప్రేమ … Read more

రామ్ చరణ్‌తో ‘మెగాస్టార్’ మూవీ చేయడమే నా డ్రీమ్: డైరెక్టర్

సినిమా: సుమంత్ హీరోగా నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రామ్ చరణ్‌తో సినిమా చేయడమే తన కల అని తెలిపారు. ఆయన అవకాశం ఇస్తే కథతో పాటు, ‘మెగాస్టార్’ అనే టైటిల్, పోస్టర్ కూడా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇది చిరంజీవి బయోపిక్ … Read more

హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు తీవ్ర బీభత్సం సృష్టించింది. ఆటోను తప్పించబోయి అదుపుతప్పిన బస్సు వేగంగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. దిల్‌సుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఈ బస్సు చౌటుప్పల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు దూసుకెళ్లిన ఉద్ధృతికి ఒక కారు పూర్తిగా ధ్వంసమవగా, మరో వాహనం దెబ్బతింది. నేరుగా డీజిల్ పంపు వద్దకు దూసుకెళ్లడంతో అక్కడి పరికరాలు పూర్తిగా విరిగిపడ్డాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో … Read more

దుర్గం చెరువు సందర్శకులకు అలర్ట్.. రెండు రోజులు ఎంట్రీ బంద్

హైదరాబాదీలకు సాయంత్రం ప్రశాంతంగా గడిపే ప్రధాన స్పాట్లలో ఒకటైన దుర్గం చెరువు రెండు రోజులపాటు మూతపడనుంది. 2026 సెప్టెంబర్ 10, 11 తేదీల్లో చెరువులోకి సందర్శకులకు అనుమతి లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ రెండు రోజులు విజిటర్స్ తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. దుర్గం చెరువు వద్ద జలమండలి కొన్ని కీలక పనులను చేపట్టింది. చెరువులో వసతులు, సౌకర్యాల మెరుగుదల కోసం ప్రస్తుతం మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్వహణ పనులకు ఎలాంటి ఆటంకం … Read more

కన్నీరు పెట్టిన బొత్స సత్యనారాయణ

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ, విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. గురువారం గరివిడిలో ఈ సమావేశం నిర్వహించారు. ఇటీవల పార్టీ మారిన ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ (చిన్న శ్రీను)తో పార్టీకి ఉన్న అనుబంధాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. ఆ సమయంలో నమ్మినవాళ్లు మోసం చేశారంటూ బొత్స ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తండ్రి కంటతడి పెట్టడం చూసి చలించిపోయిన ఆయన కుమార్తె బొత్స అనూష వెంటనే … Read more