రణబాలి షెడ్యూల్ పూర్తి చేసిన నటి రష్మిక మందన్న
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమాలో తన పాత్ర షూటింగ్‌ను రష్మిక మందన్న పూర్తి చేసుకున్నారు.
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమాలో తన పాత్ర షూటింగ్‌ను రష్మిక మందన్న పూర్తి చేసుకున్నారు.
TG CRIME: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. చౌదరిగూడకు చెందిన కొందరు యువకులు ఆదివారం అర్ధరాత్రి జోడిమెట్ల సమీపంలోని వినాయక విగ్రహాల షెడ్డుకు వెళ్లారు. అక్కడ విక్రేతలతో ధర విషయంలో వాగ్వాదం జరిగి, అది ఘర్షణకు దారితీసింది. విగ్రహాలు అమ్ముతున్న రాజస్థాన్‌కు చెందిన చోగారామ్ తలకు తీవ్రగాయం … Read more
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.490 తగ్గి రూ.1,54,090కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం రూ.450 తగ్గి రూ.1,41,250 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక మార్కెట్ల పరిస్థితులను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ధరకు అదనంగా … Read more
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామాయణ చిత్రం నుంచి సీతారాముల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.
హిందూ విశ్వాసాల ప్రకారం వినాయక చవితి నాడు చంద్రుడిని చూడటం అశుభంగా భావిస్తారు. ఈ ఆచారం వెనుక ఉన్న కథ మరియు పాటించాల్సిన సమయాల వివరాలు తెలుసుకోండి.
సినిమా: విజయ్ దేవరకొండ, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై టాలీవుడ్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో విజయ్ పూర్తి భిన్నమైన యోధుడి పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్నా ‘జయమ్మ’ అనే శక్తివంతమైన పాత్రలో అలరించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రష్మిక తన వంతు షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. … Read more
విశాఖపట్నం నగరంలోని గాజువాకలో పర్యావరణహితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతి’ ముఖ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పూర్తిగా పర్యావరణానికి మేలు చేసే విధంగా కోటి మట్టి గాజులు, స్వచ్ఛమైన చెరువు మట్టి, కొబ్బరి పీచును ఉపయోగించి శిల్పులు స్వామివారి అద్భుత రూపాన్ని తీర్చిదిద్దారు. ఆదివారం జరిగిన ఈ ముఖ ఆవిష్కరణ వేడుకలో స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని … Read more
TG CRIME: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో ఆదివారం ఉదయం ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో గాయపడిన మహిళను దివ్యవాణిగా గుర్తించారు. కాగా, రెండు రోజుల క్రితమే దివ్యవాణి కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి మధుసూదన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు … Read more
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జూన్ 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇన్-సర్వీస్ టీచర్లు 51 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెగ్యులర్ అభ్యర్థులు 47 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను ప్రభుత్వం కేటాయించిన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, మరింత సులభంగా తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంచినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ … Read more
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ బడా గణేష్ ఈ ఏడాది 72వ ఉత్సవాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రెండ్రోజుల క్రితమే విగ్రహ ఏర్పాటు పూర్తికాగా, ఉత్సవ కమిటీ గణేషుడి ఆగమనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈసారి ఏకంగా 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతి కొలువుదీరాడు. వినాయకచవితి పూజలందుకునేందుకు బొజ్జ గణపయ్య పూర్తిగా సిద్ధమయ్యాడు. సోమవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ ఘనంగా జరగనుంది. ఆ … Read more