Advertisement

కామారెడ్డి జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి

TG CRIME: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో ఆదివారం ఉదయం ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో గాయపడిన మహిళను దివ్యవాణిగా గుర్తించారు. కాగా, రెండు రోజుల క్రితమే దివ్యవాణి కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి మధుసూదన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement