Advertisement

తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.490 తగ్గి రూ.1,54,090కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం రూ.450 తగ్గి రూ.1,41,250 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక మార్కెట్ల పరిస్థితులను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ధరకు అదనంగా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.

Advertisement