చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే నీళ్ల తరలింపు: మాజీ మంత్రి హరీశ్‌రావు
TG: దేశమంతా ఎల్‌నినో ప్రభావం ఉన్న ఈ తరుణంలో చుక్కచుక్క నీటిని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాలపై మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పంట పొలాలు ఎండుతుంటే, కృష్ణా జలాలను దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా ఏపీకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లముందే నీళ్లు పారుతున్నా ప్రజలకు ఇవ్వలేని దుస్థితి సాగుతోందని ధ్వజమెత్తారు. పాలమూరుపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న ప్రేమ … Read more