Advertisement

మంచిర్యాల పాఠశాలలో వికటించిన రాత్రి భోజనం 30 మంది విద్యార్థినులు అస్వస్థత

మన పత్రిక: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో రాత్రి భోజనం వికటించి దాదాపు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం జులై 22న రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందిన వారిలో ఎక్కువ మంది అర్ధరాత్రి కల్లా డిశ్చార్జ్ అయ్యారు. అయితే డిశ్చార్జ్ అయిన వారిలో సుమారు ఎనిమిది మందికి గురువారం ఉదయం మళ్లీ అవే లక్షణాలు కనిపించడంతో వారిని తిరిగి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఘటనపై స్పందించిన అధికారులు ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

Advertisement
Advertisement