ఎర్రవల్లిలో పసుపు నీళ్లతో శుద్ధీకరణ

TG: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించేందుకు యత్నించిన నేపథ్యంలో, బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. తమ గ్రామాన్ని కాంగ్రెసోళ్లు వచ్చి అపవిత్రం చేశారని ఆరోపిస్తూ బుధవారం గ్రామ ప్రధాన కూడలిలో పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ బాలరాజు, గ్రామ అధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్, నాయకుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొని కాంగ్రెస్ నాయకుల తీరును … Read more

కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవలు అందించాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనసభలో సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సభ తరఫున సభ్యులందరూ సంయమనం పాటించి తమ తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం గానీ, సభలోని సభ్యులు గానీ కేసీఆర్‌ గారి చావును ఎన్నడూ కోరుకోవడం లేదని భట్టి … Read more

POLITICS: సెషన్ మొత్తానికి BRS సభ్యుల సస్పెన్షన్

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మూడో రోజూ తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం, కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడి అంశాలపై చర్చించాలని కోరుతూ భారాస సమర్పించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలో రగడ మొదలైంది. BRS సభ్యులు ‘వి వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారి తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడుతూ.. “దేనికి జస్టిస్ కావాలి? మీ హయాంలో అన్యాయానికి గురైన దళితులకా?” అని ప్రశ్నించారు. సభా కార్యక్రమాలకు … Read more

ఖమ్మం గురుకులంలో దారుణం.. విద్యార్థి మృతి

TG: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఆటలాడుతూ 8వ తరగతి విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన హరీష్, ప్రియాంక దంపతుల కుమారుడు సలిగంటి సాత్విక్‌ (14) రఘునాథపాలెం గురుకులంలో చదువుతున్నాడు. బుధవారం ఉదయం 5 గంటలకు లేచి తోటి విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో రన్నింగ్ చేశాడు. పరుగు పూర్తి చేసి వచ్చిన సాత్విక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని వ్యాయామ ఉపాధ్యాయుడు తెలిపారు. వెంటనే … Read more

ఘట్‌కేసర్‌: గణేశ్ విగ్రహ తరలింపులో డ్రైవర్‌ మృతి

TG CRIME: వినాయక విగ్రహం తరలింపులో నిర్వాహకుడి నిర్లక్ష్యం ఓ ఆటో ట్రాలీ డ్రైవర్ ప్రాణాలను బలిగొంది. ఎస్సై ఎ.శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మండలం ఘనపూర్‌ నుంచి అల్వాల్‌కు భారీ గణేశుడి విగ్రహాన్ని తరలించేందుకు నిర్వాహకుడు శరత్‌యాదవ్‌ ఓ ఆటో ట్రాలీని ఏర్పాటు చేశాడు. సోమవారం విగ్రహాన్ని తరలిస్తుండగా వేలాడుతున్న 11 కేవీ విద్యుత్తు తీగల వల్ల ప్రమాదం ఉందని డ్రైవర్‌ భానుప్రసాద్‌(28) చెప్పినా వినకుండా, వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాలని శరత్‌ ఒత్తిడి చేశాడు. … Read more

పసిడికి బ్రేక్‌.. తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి రేటు ఇవాళ చల్లబడింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 తగ్గి రూ.1,54,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.950 పడిపోయి రూ.1,41,450 వద్ద నమోదైంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద విక్రయమవుతోంది. వివిధ ప్రాంతాలు, స్థానిక పన్నులను బట్టి ఈ ధరల్లో … Read more

పోలీస్ కొలువుల్లో ట్రాన్స్‌జెండర్లకు చోటు ఇవ్వాల్సిందే: హైకోర్టు

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ట్రాన్స్‌జెండర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని హైకోర్టు TSLPRBని ఆదేశించింది. దరఖాస్తు ఫారమ్‌లలో మేల్, ఫిమేల్‌తో పాటు ‘అదర్స్’ లేదా ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ లేకపోవడాన్ని తప్పుపడుతూ తనుశ్రీ, ఇతరులు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. సాంకేతికంగా ఆన్‌లైన్‌లో వీలుకాకపోతే ఆఫ్‌లైన్ ద్వారా వారి దరఖాస్తులను స్వీకరించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. రాష్ట్రంలో వివిధ … Read more

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. వారం వ్యవధిలో రానున్న పండుగలు, వారాంతపు సెలవులతో ప్రజలు ప్రయాణాలు, వేడుకలకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబరు 12న రెండో శనివారం, 13న ఆదివారం కావడంతో సాధారణ సెలవులు ఉండనున్నాయి. ఆ వెంటనే సెప్టెంబరు 14న సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. దీంతో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా మూడు రోజులు విరామం లభించనుంది. … Read more

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ శాఖలో 7,437 పోస్టులకు జూలై 29న ప్రభుత్వం 4 నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 9వ తేదీతో ముగియాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో వారం రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థులు ఇకపై సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు … Read more

బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అరెస్ట్

హైదరాబాద్‌: రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రముఖ మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అక్రమ అరెస్టులతో … Read more