మన పత్రిక, మేడ్చల్: మేడ్చల్ పరిధిలోని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44 పై నిలిపి ఉంచిన ఒక లారీని స్కూల్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని మేడ్చల్ పోలీసులు తెలిపారు. ముందు ఉన్న లారీని డ్రైవర్ సరిగ్గా గమనించకపోవడంతోనే బస్సు దాన్ని ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వాహనం నడిపి గాయపరిచినందుకు బిఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 125(ఎ) కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సర్వదర్శనానికి 24 గంటల సమయం
- రాష్ట్రంలో నీటి కొరతపై ఇరిగేషన్ అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశాలు
- చిత్తూరు జిల్లాలోని బంగారు గనుల్లో తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు
- సైబర్ బాధితులకు రూ. 9.78 కోట్లు రీఫండ్ చేసిన టీజీసీఎస్బీ
- మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు: ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇవే
