సెమీస్‌లో భారత్ ఘన విజయం: ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు!

team india into t20 world cup finals

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన ఉత్కంఠభరిత పోరులో, భారత జట్టు ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో, ఇటు బ్యాటింగ్, అటు ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ పైచేయి సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ ఓపెనర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు … Read more

బిగ్ అప్డేట్: ఒక వారం ముందే రిలీజ్ అవబోతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”!

utsaad bhagat singh

OG లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. ఇప్పుడు ఈ సినిమాకి సంభందించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా విడుదల తేదీని మార్చి 26 నుండి మార్చి 19 కి ప్రీ పోన్ చేయడం జరిగింది. అనగా ఇంతకుముందు చెప్పిన తేదీ కన్నా ఒక వారం ముందే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇదివరకే మార్చి … Read more

Suryapet : వ్యాపారులకు ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్!

మన పత్రిక వెబ్​డెస్క్, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా వెలసిన ఆక్రమణలను పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా తొలగించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై సాయిరాం మాట్లాడుతూ.. వ్యాపారులు రోడ్లను ఆక్రమించి దుకాణాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో రోడ్లపైకి వచ్చిన షాపుల సామగ్రిని, మట్టి కుప్పలను క్లియర్ చేశారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా … Read more

CM Revanth Reddy భారీ యాక్షన్ ప్లాన్.. 99 రోజుల పాటు ‘ప్రజా పాలన – ప్రగతి’!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2న గ్రామసభలతో ప్రారంభమై, జూన్ 2న … Read more

బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. 25 దుకాణాలు దగ్ధం, రూ.5 కోట్ల నష్టం!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు.. ప్రధాన రహదారి వెంట ఉన్న సుమారు 25 ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బాచుపల్లి-మియాపూర్ రూట్లోని కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో ఈ దుకాణాలు ఉన్నాయి. వ్యాపారులు అక్కడే నివాసం ఉంటుండటంతో, లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో మంటలు మరింత వేగంగా … Read more

Balka Suman Bail: జైలు నుంచి బాల్క సుమన్‌ రిలీజ్.. కోర్టు విధించిన షరతులు ఇవే!

మన పత్రిక వెబ్​డెస్క్, మంచిర్యాల: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ వద్ద మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 17న జరిగిన ఈ దాడి ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా.. పోలీసులు సుమన్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఏ. వీరయ్య షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. … Read more

TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అధికారులు శుభవార్త చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) ఆదివారం టీజీ పీజీఈసెట్-2026 (TG PGECET) నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎం.టెక్, ఎం.ఫార్మసీ తదితర పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఈ ఎంట్రెన్స్ పరీక్ష అత్యంత కీలకం కానుంది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. టీజీ … Read more

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో కొద్ది రోజులుగా చలి తీవ్రత తగ్గిపోయి, ఎండలు నెమ్మదిగా పెరుగుతున్న వేళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ వాతావరణ శాఖ (IMD) రాష్ట్ర ప్రజలకు తాజా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంటూ అధికారికంగా ఎల్లో హెచ్చరికలను (Yellow … Read more

TG EAPCET 2026: సిలబస్ వచ్చేసింది.. రేపటి నుంచే దరఖాస్తులు.. డౌన్లోడ్ చేసుకోండిలా!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా, తాజాగా అధికారులు పరీక్ష సిలబస్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రేపటి నుంచి (ఫిబ్రవరి 19) ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకునేందుకు వీలుగా సిలబస్ వివరాలను ప్రకటించారు. సిలబస్‌ను డౌన్లోడ్ చేసుకోవాలనుకునే విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ … Read more

Karimnagar Mayor Seat : ‘16వ తేదీన ఏమవుతుందో చూద్దాం’.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!

మన పత్రిక వెబ్​డెస్క్, కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఫలితాల అనంతరం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆ పార్టీకి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మేయర్ పీఠంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ కూడా రేసులో ఉన్నట్లు మంత్రి పరోక్ష … Read more