OG లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. ఇప్పుడు ఈ సినిమాకి సంభందించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా విడుదల తేదీని మార్చి 26 నుండి మార్చి 19 కి ప్రీ పోన్ చేయడం జరిగింది. అనగా ఇంతకుముందు చెప్పిన తేదీ కన్నా ఒక వారం ముందే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఇదివరకే మార్చి 26న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా రిలీజ్ చేయాలన్న కారణంతో రాంచరణ్ నటించిన “పెద్ది” సినిమాను ఏప్రిల్ కి వాయిదా వేయడం జరిగింది. అలాగే అదే రోజు విడుదల కావాల్సిన కన్నడ స్టార్ హీరో యష్ నటించిన “టాక్సిక్” మూవీ విడుదలని కూడా ఇప్పుడు జూన్ 4 కి వాయిదా వేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ని బట్టి, ఈ సినిమాకి సంభందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ ని దేవి శ్రీ ప్రసాద్ బదులుగా థమన్ కి పూర్తి చేయమని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక పక్కన టాక్సిక్ సినిమా వాయిదా, మరో పక్కన థమన్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ని త్వరగా పూర్తి చేసుకుని ఒక వారం ముందే సినిమా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీలా మరియు రాశి ఖన్నా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబో లో వస్తున్న ఈ సినిమాపై అటు సినీ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ఇదే రోజున బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ పార్ట్ 2 కూడా రిలీజ్ కానుంది. మరి అనుకున్న తేదీ కన్నా ఒక వారం ముందే రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో వేచి చూడాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
