ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన ఉత్కంఠభరిత పోరులో, భారత జట్టు ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో, ఇటు బ్యాటింగ్, అటు ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ పైచేయి సాధించింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ ఓపెనర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాట వేశాడు. దూబే 25 బంతుల్లో 43, ఇషాన్ 18 బంతుల్లో 39, హార్దిక్ 12 బంతుల్లో 27 రన్స్ తో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను బౌలర్లు, ముఖ్యంగా ఫీల్డర్ అక్షర్ పటేల్ అద్భుత క్యాచ్‌లతో కట్టడి చేశారు. రసవత్తరంగా సాగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినా, చివరకు ఇంగ్లాండ్ 246 పరుగులకే పరిమితమైంది.
ఈ విజయంతో భారత్ ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. సొంతగడ్డపై వరల్డ్ కప్ సాధించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియాపై అభిమానుల అంచనాలు పెరిగిపోయాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
