అవకాశవాద రాజకీయం పెరిగిపోయింది: మాజీ మంత్రి కొండా సురేఖ

వరంగల్: పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, ఎప్పుడూ ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో నిర్వహించిన కార్యకర్తలు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను సాధారణ ఎంపీటీసీ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగానంటే కష్టకాలంలో వెన్నంటి నిలిచిన కార్యకర్తలదే ప్రధాన పాత్ర అని కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం క్షణం కూడా ఆలోచించకుండా మంత్రి పదవికి రాజీనామా చేశానని, ఆయన ఉన్నన్నాళ్లు తమను కంటికి రెప్పలా … Read more

ఆసిఫాబాద్: పెళ్లయిన రెండు నెలలకే తేజస్విని మృతి

TG CRIME: జాతీయ రహదారిపై ఉన్న గుంత ఓ నవవధువు ప్రాణాలను బలితీసుకుంది. వివాహమై రెండు నెలలు కాకముందే ఘోర రోడ్డు ప్రమాదంలో అధ్యాపకురాలు మృతిచెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన తేజస్విని (27) సిర్పూర్‌(టి) సాంఘిక సంక్షేమ గురుకులంలో పార్ట్‌టైం రసాయనశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కౌటాల మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తిరుపతితో ఈ ఏడాది జులై 5న ఆమెకు వివాహమైంది. పొలాల పండగ నిమిత్తం సొంత … Read more

గణేష్ భక్తులకు TGSRTC గుడ్ న్యూస్

TG: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా ఈ సేవలు సాగనున్నాయి. జేబీఎస్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సులు ప్యాట్నీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ … Read more

తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 16కు వాయిదా.. బుధవారం ‘ఎల్ నినో’పై చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి నేటి వరకు జరగాల్సిన సమావేశాలను ఒక రోజు పొడిగిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం జరిగే సభలో ‘ఎల్ నినో’ పరిస్థితులు, వర్షాభావాలను ఎలా ఎదుర్కోవాలి, రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. కాగా, శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ’22ఏ’ భూముల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య … Read more

జొమాటో కస్టమర్లకు మరో షాక్!

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ రకాల ఛార్జీలతో జేబులు గుల్ల చేస్తున్న ఆ సంస్థ.. తాజాగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఎంచుకునే కస్టమర్లపై అదనంగా రూ.5 నుంచి రూ.20 వరకు వసూలు చేయడం మొదలుపెట్టింది. బిల్లు సమ్మరీలో ఈ ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ ప్రత్యేకంగా కనిపిస్తుండటం గమనార్హం. డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ఈ భారం ఉండదు కానీ, … Read more

‘స్పిరిట్’పై నిర్మాత ప్రణయ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TG CINEMA: రివ్యూలతో సినిమాల స్థాయిని ఎప్పటికీ తగ్గించలేరని నిర్మాత ప్రణయ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన నిర్మించిన ‘రోమాంచకం’ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. కొందరు కావాలనే విమర్శలు చేశారని ఆయన మండిపడ్డారు. ఒక ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడం వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుందని, రివ్యూల పేరుతో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. తాను నిర్మిస్తోన్న భారీ అప్‌కమింగ్ చిత్రం ‘స్పిరిట్’ గురించి ప్రస్తావిస్తూ.. వారికి నిజంగా అంత … Read more

బిగ్‌బాస్ ఎంట్రీపై సుప్రీతా క్లారిటీ.. తల్లి ఇష్టమే నాకెక్కువ

TG: టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రీతా బిగ్‌బాస్ పదో సీజన్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తాజాగా సుప్రీతా స్పందించి స్పష్టతనిచ్చారు. తనకు బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ, తల్లి సురేఖా వాణికి ఉన్న ఆందోళనల కారణంగా తాను ఈ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. హౌస్‌లో భావోద్వేగాలను తాను కంట్రోల్ చేసుకోగలనా లేదా అనే సందేహాలు తన తల్లికి … Read more

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్

TG POLITICS: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీసిన ఆమె, అంతర్గత విభేదాలు పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో తిరిగి క్రియాశీలకంగా మారాలని సూచించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కొండా సురేఖ గైర్హాజరు కావడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఇన్‌ఛార్జి నేరుగా ఫోన్ చేయడం ప్రాధాన్యత … Read more

‘ఢీ’ షో విన్నర్ రాజు అరెస్ట్.. లైంగిక వేధింపుల కేసు

TG: ప్రసిద్ధ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 10’ విజేత రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 9న ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మూడు రోజుల తర్వాత తాజాగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ ఇన్‌స్పెక్టర్ జయరాం తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, కేసు నమోదు చేసిన విషయాన్ని పోలీసులు … Read more

చరణ్ తర్వాత ‘బిగ్‌బాస్’ హౌస్ నుంచి చైత్ర అవుట్?

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్‌బాస్’ సీజన్ 10 సంచలనాలతో రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 6న వైభవంగా ప్రారంభమైన ఈ షోలో తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఇంటి సభ్యులను బయటకు పంపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తొలి రోజుల్లోనే చరణ్ ఎలిమినేట్ కాగా, ఆ వెంటనే బిగ్‌బాస్ హౌస్‌మెట్స్‌కు బిగ్ టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో సులభమైన టాస్క్ కోసం ఏడుగురు, కష్టమైన … Read more