మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు.. ప్రధాన రహదారి వెంట ఉన్న సుమారు 25 ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
బాచుపల్లి-మియాపూర్ రూట్లోని కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో ఈ దుకాణాలు ఉన్నాయి. వ్యాపారులు అక్కడే నివాసం ఉంటుండటంతో, లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో మంటలు మరింత వేగంగా పక్క దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణనష్టం జరగకపోయినా.. రెక్కల కష్టం కళ్లెదుటే కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దాదాపు రూ.5 కోట్ల మేర భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2% డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం
- Telangana Weather: 5 రోజుల పాటు వర్షాలు.. జిల్లాల వారీగా వివరాలు
- Gold Price Today: ఈరోజు బంగారం ధరలు April 18
- Lenskart: బాయ్‌కాట్ ట్రెండ్‌పై సీఈవో వివరణ, క్షమాపణలు
