TG: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత ‘రైతుభరోసా’కు రంగం సిద్ధం!

మన పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే దిశగా రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.2,650 కోట్లను సమీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం. జీతాలు, అప్పుల కిస్తీలు చెల్లించిన తర్వాత మిగిలిన వనరులతో నిధుల సమీకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.మొత్తం మూడు విడతల్లో యాసంగి రైతుభరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా మార్చి 22న రూ.3,590 కోట్లను సుమారు … Read more

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు

మన పత్రిక, వాతావరణం: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే వేడిగాలుల మధ్య ఉపశమనం కలిగించేలా వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, … Read more

TG Inter Result 2026: టీజీ ఇంటర్ ఫలితాలపై అప్‌డేట్..

మన పత్రిక, హైదరాబాద్: Telangana Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియ పూర్తిగా ముగిసింది. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ నుంచి 4 లక్షల మంది, సెకండ్ ఇయర్ నుంచి 5 లక్షల మంది.. మొత్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. … Read more

సూర్యాపేట లోక్ అదాలత్‌లో 3890 కేసుల పరిష్కారం

మన పత్రిక, సూర్యాపేట: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. పోలీసు, న్యాయ, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,890 కేసులను వేగవంతంగా పరిష్కరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాలత్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పరిష్కారమైన కేసుల వివరాలను ఎస్పీ వెల్లడిస్తూ.. ఇందులో ఎంవీ … Read more

TG: ప్రభుత్వ తీరుపై ‘గులాబీ’ గర్జన.. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్!

మన పత్రిక, హైదరాబాద్: పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వద్దనే పోలీసు శాఖ ఉన్నప్పటికీ నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడే పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో పోలీసులకు గౌరవం లభించిందని, అనేక పోస్టులను భర్తీ చేసి కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. … Read more

TG: ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌.. మెనూ ఇదే..!

మన పత్రిక, తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ అమలుకు అధికారులు కసరత్తు పూర్తి చేసి, వారాంతపు మెనూను సిద్ధం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బలవర్ధక అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.720 కోట్లను కేటాయించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు … Read more

HYD: నేడు వైన్ షాపులు బంద్..!

మన పత్రిక, హైదరాబాద్: నగరంలో శుక్రవారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కళ్లుదుకాణాలు అలాగే స్టార్ హోటళ్లలోని బార్లలో కూడా మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధికారిక ఉత్తర్వులు జారీచేస్తూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు … Read more

TG: తెలంగాణలో పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారుల్లో భయాందోళనలు పెరిగి బంకుల వద్ద బారులు తీరుతున్నారు. దీనివల్ల నగరంలోని ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఆఫీసులు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పెట్రోల్ కొరత వార్తలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో మూడు నెలలకు సరిపడా ఇంధన … Read more

కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్.. పథకాలకు ఇందిరమ్మ పేరెందుకు?

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ కల్లు, గల్ఫ్ కార్మికుల సమస్యలు, ప్రభుత్వ పథకాల పేర్లు, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర తెలంగాణలో ఆల్ఫ్రాజోలం (Alprazolam) కల్తీ కల్లు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ లేని తెలంగాణను నిర్మించాలని డిమాండ్ చేస్తూనే.. మద్యం బ్రాండ్లలాగే … Read more

HYDలో సిలిండర్లు లాక్కెళ్తున్న ప్రజలు

మన పత్రిక తెలంగాణ: రాష్ట్రంలో వంటగ్యాస్ కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. రోజులు గడుస్తున్నా బుక్ చేసిన సిలిండర్లు ఇంటికి రాకపోవడంతో వినియోగదారుల సహనం నశించి గ్యాస్ ఏజెన్సీలపై దాడులకు దిగుతున్నారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ కూడలి వద్ద గురువారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ల లోడ్‌తో బయటకు వస్తున్న ఆటోను చూసిన కొందరు స్థానికులు ఒక్కసారిగా దానిపైకి దూసుకెళ్లారు. అనుమతి లేకుండా ఆటోలోని సిలిండర్లను బలవంతంగా తీసుకెళ్లేందుకు … Read more