మన పత్రిక, తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ‘సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్’ అమలుకు అధికారులు కసరత్తు పూర్తి చేసి, వారాంతపు మెనూను సిద్ధం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బలవర్ధక అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.720 కోట్లను కేటాయించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది.
విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం, డ్రాప్ఔట్లను నియంత్రించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. పిల్లలకు బోర్ కొట్టకుండా, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మిల్లెట్లు, పౌష్టికాహార పదార్థాలతో మెనూను రూపొందించారు. సోమవారం దోశ-పాలు, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ-రాగి జావ, బుధవారం పూరీ-పాలు, గురువారం మిల్లెట్ ఇడ్లీ-రాగి జావ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-పాలు, శనివారం బోండా-రాగి జావ ఇవ్వనున్నారు.
క్యాల్షియం, ఐరన్ లోపాలను నివారించేందుకు వారానికి మూడు రోజులు రాగి జావ, మిగతా రోజులు పాలను అందించనున్నారు. ఆహార నాణ్యతపై రాజీ లేకుండా పాఠశాల యాజమాన్య కమిటీలు, అధికారులు పర్యవేక్షణ చేపట్టనున్నారు
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
