మన పత్రిక, హైదరాబాద్: Telangana Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియ పూర్తిగా ముగిసింది. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ నుంచి 4 లక్షల మంది, సెకండ్ ఇయర్ నుంచి 5 లక్షల మంది.. మొత్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ప్రస్తుతం జవాబు పత్రాలకు సంబంధించిన మార్కుల క్రోడీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది కూడా పూర్తయ్యాక సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) ఆధ్వర్యంలో సాంకేతిక అంశాలను పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహిస్తారు. తొలుత ఏప్రిల్ 5 లేదా 6వ తేదీల్లో ఫలితాలు విడుదల చేయాలని భావించినప్పటికీ, సాంకేతిక కారణాల రీత్యా ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి తీసుకున్న అనంతరం ఫలితాల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఏడాది కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేరోజు విడుదల చేయనున్నారు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..
- ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లు https://www.tgbie.in/ లేదా tsbie.cgg.gov.in లోకి వెళ్లాలి.
- ఇంటర్ రిజల్ట్స్ 2026 (Inter Results 2026) లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ సంవత్సరం (1st or 2nd year) ఎంచుకుని, హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్ నొక్కగానే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ కాపీని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
