Advertisement

ఉద్యోగుల బకాయిలకు రూ.2 వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

మన పత్రిక: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో భాగంగా ప్రభుత్వం గురువారం మరో రూ.2,000 కోట్ల నిధులను విడుదల చేసింది. ఉద్యోగ సంఘాల నాయకుల వినతి మేరకు 100 రోజుల్లో నిధులు విడుదల చేస్తామని గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి, ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మొత్తం రూ.6,000 కోట్ల బకాయిలను విడతల వారీగా పూర్తి స్థాయిలో చెల్లించింది.

ఈ నిధుల విడుదలను ప్రభుత్వం మూడు విడతల్లో చేపట్టింది. మే 29న మొదటి విడతగా రూ.2,000 కోట్లు, జూన్ 30న రెండో విడతగా మరో రూ.2,000 కోట్లను కేటాయించింది. తాజాగా మూడో విడత కింద గురువారం రూ.2,000 కోట్లు విడుదల చేయడంతో నిధుల ప్రక్రియ ముగిసింది.

Advertisement

పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ఈ నిధుల ద్వారా పూర్తిగా చెల్లించినట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో ఇతర పెండింగ్ బకాయిలను కూడా క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

Advertisement