Advertisement

రేషన్‌కార్డుల ఈ-కేవైసీ గడువును పెంచిన సర్కార్

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేసేందుకు ఉన్న గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. నిర్ణయించిన గడువు ముగియడంతో ఈ సమయాన్ని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారికంగా ప్రకటించింది.

నిర్దేశిత సమయానికి ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే నిత్యావసర సరకుల పంపిణీ నిలిచిపోతుందనే ప్రచారం ఉండటంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో లబ్ధిదారులకు ఉపశమనం లభించింది. దీనికితోడు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ మధ్య మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ సరుకులను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement