తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం!
మన పత్రిక, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. రద్దీ భారీగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదం, వైద్య సహాయం నిరంతరం అందిస్తున్నట్లు … Read more