గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై ఇప్పటికి క్లారిటీ లేక ఫ్యాన్స్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ముందుగా రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా మార్చి 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్… ఆ తర్వాత డేట్ మార్చి ఏప్రిల్ 30ను విడుదలవుతుందని ఫైనల్ చేశారు. అయితే కొన్ని రోజులుగా ఆ డేట్ నుండి కూడా తప్పుకుని, పెద్ది జూన్ లో రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే తాజాగా ఈ రూమర్స్ కి క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్.
తాజగా నిహారిక కొణిదెల నిర్మించిన “రాకాస” టీం కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన చరణ్, ఆ ఇంటర్వ్యూ లో పెద్ది విడుదల వాయిదా పడలేదని, క్లారిటీ ఇస్తూ, “పెద్ది” సినిమా ఏప్రిల్ 30న పక్కాగా రిలీజ్ అవుతుందని క్లియర్ గా చెప్పేశాడు. దాంతో ఈ వాయిదా వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఇక బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతి బాబు (Jagapathi Babu), శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), దివ్యేన్ధు శర్మ (Divyenndu Sharma) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎఆర్ రెహమాన్ (A.R.Rahman) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవి మేకర్స్ – వృద్ధి సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
