డీఎస్సీ-2025 నియామకాల్లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని వైకాపా అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్ష రాయకుండానే కొందరికి టీచర్ పోస్టులు ఇచ్చేశారని, జరగని గేమ్స్‌లో ఆడినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వీళ్లే ధ్రువీకరించుకున్నారని మండిపడ్డారు. అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాల్లోనూ తీవ్ర అవకతవకలు జరిగాయని, వీటిపై ఆధారాలు చూపిస్తున్న అభ్యర్థులు, జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వ్యవస్థలను చెడగొడితే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. అటవీశాఖలోనూ 814 పోస్టుల్లో 40 పోస్టులను పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారని, తాము ఈ అంశాన్ని లేవనెత్తడంతోనే ఆ నియామక ప్రక్రియను నిలిపివేశారని పేర్కొన్నారు.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
