Advertisement

హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు తీవ్ర బీభత్సం సృష్టించింది. ఆటోను తప్పించబోయి అదుపుతప్పిన బస్సు వేగంగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. దిల్‌సుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఈ బస్సు చౌటుప్పల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు దూసుకెళ్లిన ఉద్ధృతికి ఒక కారు పూర్తిగా ధ్వంసమవగా, మరో వాహనం దెబ్బతింది. నేరుగా డీజిల్ పంపు వద్దకు దూసుకెళ్లడంతో అక్కడి పరికరాలు పూర్తిగా విరిగిపడ్డాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదంతో బంక్ సిబ్బంది, అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. బస్సు అతివేగంగా ఉండటం వల్లే అదుపుతప్పినట్లు సమాచారం. ఈ భయానక ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Advertisement
Advertisement