Advertisement

రామ్ చరణ్‌తో ‘మెగాస్టార్’ మూవీ చేయడమే నా డ్రీమ్: డైరెక్టర్

సినిమా: సుమంత్ హీరోగా నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రామ్ చరణ్‌తో సినిమా చేయడమే తన కల అని తెలిపారు. ఆయన అవకాశం ఇస్తే కథతో పాటు, ‘మెగాస్టార్’ అనే టైటిల్, పోస్టర్ కూడా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇది చిరంజీవి బయోపిక్ కాదని, ‘ధురంధర్’ లాంటి జోనర్‌లో రాసుకున్న ఈ కథ రామ్ చరణ్‌కు మాత్రమే సరిపోతుందని స్పష్టం చేశారు. ‘స్వయంకృషి’ చిత్రంలో చిరంజీవి చెప్పులు కుట్టే సీన్‌లో ఆయన స్థానంలో రామ్ చరణ్ ఉండేలా.. 1980లలో మెగాస్టార్ ఎలా ఉండేవారో ఆ రకమైన పాత్రలో ఆయన నటిస్తారని తెలిపారు. ప్రస్తుతం వస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ తన నెక్ట్స్ సినిమాలకు వారధిలా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement