Advertisement

దుర్గం చెరువు సందర్శకులకు అలర్ట్.. రెండు రోజులు ఎంట్రీ బంద్

హైదరాబాదీలకు సాయంత్రం ప్రశాంతంగా గడిపే ప్రధాన స్పాట్లలో ఒకటైన దుర్గం చెరువు రెండు రోజులపాటు మూతపడనుంది. 2026 సెప్టెంబర్ 10, 11 తేదీల్లో చెరువులోకి సందర్శకులకు అనుమతి లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ రెండు రోజులు విజిటర్స్ తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు.

దుర్గం చెరువు వద్ద జలమండలి కొన్ని కీలక పనులను చేపట్టింది. చెరువులో వసతులు, సౌకర్యాల మెరుగుదల కోసం ప్రస్తుతం మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్వహణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఎంట్రీని తాత్కాలికంగా క్లోజ్ చేసినట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది.

Advertisement
Advertisement