10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత.. | Tirumala Tirupati Devasthanam

మన పత్రిక, వెబ్​డెస్క్: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ వేళల్లో టీటీడీ కీలక మార్పులు చేసింది. 2026 మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో, ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గ్రహణం విడిచిన తర్వాత రాత్రి 8:30 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా ఆ రోజు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వంటి ఆర్జిత … Read more

Bhogapuram Airport: ఎయిర్‌పోర్ట్‌కు తొలి విమానం..

మన పత్రిక, వెబ్​డెస్క్: ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై తొలి విమానం దిగనుంది. ట్రయల్ రన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మొదటి విడతలో 96 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 2203 ఎకరాల్లో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. అబ్బురపరిచే విశేషాలు:

ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య.. కారణం ఇదే

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే యముడిగా మారి ముగ్గురు చిన్నారులను పొట్టనబెట్టుకున్నాడు. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సురేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మృతులను కావ్య (7), జ్ఞానేశ్వరి (4), సూర్య గగన్ (2)గా గుర్తించారు. … Read more

అమరావతిలో హైకోర్టు పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ

రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. తాజాగా వివిధ సంస్థలకు 49.50 ఎకరాల భూమిని కేటాయిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బాసిల్ వుడ్స్, సెయింట్ మేరీస్ స్కూల్, సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్, బ్యాంకులు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం 12.66 ఎకరాలను కేటాయించారు. గతంలో ఇచ్చిన 42.30 ఎకరాల్లో స్వల్ప మార్పులు చేశారు. మరోవైపు, ప్రతిష్టాత్మక హైకోర్టు నిర్మాణంలో కీలకమైన ర్యాప్తు (Raft) … Read more

రైతులకు రూ. లక్ష రుణం.. అర్హతలు, నిబంధనలు ఇవే.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని కౌలు రైతులకు (Tenant Farmers) తీపి కబురు అందించింది. పెట్టుబడి సాయం కింద వారికి కూడా రూ. లక్ష వరకు రుణం (Loan) అందజేయాలని నిర్ణయించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా ఈ రుణాలను మంజూరు చేయనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అధికారులు అర్హులైన కౌలు రైతుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రుణం పొందేందుకు అర్హతలు & నిబంధనలు: ఎవరికి వర్తించదు? అసైన్డ్ భూములు సాగు … Read more

కలెక్టర్లకు సీఎం చంద్రబాబు క్లాస్.. పాలనలో ఆ రెండూ ఉండాల్సిందే! | Chandrababu naidu

మన పత్రిక, వెబ్​డెస్క్: అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏ పని చేసినా పూర్తి వివరాలతో, స్పష్టతతో ముందుకు వెళ్లాలని సూచించారు. లక్ష్యాలను ముందే నిర్ణయించుకుని, అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. కేవలం రోజువారీ పనులు కాకుండా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాల్లో పనులు సాగుతున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని తెలిపారు. నిత్య విద్యార్థిలా ఉండాలి.. ప్రభుత్వంలో … Read more

ఢిల్లీ వెళ్లాల్సిన లోకేశ్ విమానం జైపూర్‌కు మళ్లింపు.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఉత్తర భారతదేశంలో కమ్మేసిన దట్టమైన పొగమంచు (Fog) విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరగా, అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని జైపూర్‌కు (Jaipur) మళ్లించారు. ఢిల్లీలో పొగమంచు కారణంగా ఇప్పటివరకు దాదాపు 40 విమానాలు రద్దయ్యాయి. మరో 4 విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. … Read more

ల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. టీడీపీ అవిశ్వాసానికి ముందే ట్విస్ట్.

మన పత్రిక, వెబ్​డెస్క్: Nellore Mayor Sravanthi : నెల్లూరు నగరపాలక సంస్థ (Nellore Corporation) రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి ముందే మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాల్సి ఉండగా, అంతకంటే ముందే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. రాజీనామా లేఖను నేడు కలెక్టర్‌కు అందజేయనున్నట్లు స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన … Read more

డిసెంబర్ 15 నుంచి పరీక్షలు.. టైమింగ్స్ ఇవే | AP kaushalam exam schedule 2025

AP kaushalam exam schedule 2025

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘కౌశలం’ (Work From Home Job Skill Test) అసెస్‌మెంట్ పరీక్షలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. (AP kaushalam exam date ) డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతంలో సాంకేతిక సమస్యలు, సిస్టమ్ ఎర్రర్లు లేదా సెలవుల కారణంగా పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. అభ్యర్థులు తమ సొంత గ్రామ లేదా … Read more

AP Bus Accident: 10 మంది మృతి, 20 మందికి గాయాలు.

alluri bus accident

మన పత్రిక, వెబ్​డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో పర్యాటకుల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అన్నవరం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. చిత్తూరుకు చెందిన ఏవీఎం ట్రాన్స్‌పోర్టు బస్సు (AVM Transport)ను 7 రోజుల టూర్ కోసం … Read more