మన పత్రిక, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే యముడిగా మారి ముగ్గురు చిన్నారులను పొట్టనబెట్టుకున్నాడు. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలోనే సురేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మృతులను కావ్య (7), జ్ఞానేశ్వరి (4), సూర్య గగన్ (2)గా గుర్తించారు. సురేంద్ర భార్య ఎనిమిది నెలల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి లేని పిల్లలను తండ్రే చేతులారా చంపేయడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
