మన పత్రిక, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని కౌలు రైతులకు (Tenant Farmers) తీపి కబురు అందించింది. పెట్టుబడి సాయం కింద వారికి కూడా రూ. లక్ష వరకు రుణం (Loan) అందజేయాలని నిర్ణయించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా ఈ రుణాలను మంజూరు చేయనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అధికారులు అర్హులైన కౌలు రైతుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
రుణం పొందేందుకు అర్హతలు & నిబంధనలు:
Advertisement
- కౌలు పత్రం: అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు (CCRC) తప్పనిసరిగా ఉండాలి.
- భూమి: కనీసం ఒక ఎకరం సాగులో ఉండాలి. ఎకరం కంటే తక్కువ ఉంటే రుణం వర్తించదు.
- సభ్యత్వం: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో నివాసం ఉంటూ, ఆ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- చెల్లింపు: తీసుకున్న రుణాన్ని అసలు, వడ్డీతో కలిపి ఏడాదిలోపు తిరిగి చెల్లించాలి. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘాలుగా ఏర్పడి రుణం పొందవచ్చు.
ఎవరికి వర్తించదు? అసైన్డ్ భూములు సాగు చేస్తున్న వారికి, స్థానికేతరులకు ఈ రుణం మంజూరు చేయబడదు. దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు త్వరలోనే వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
